ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల ప్రచారం విషయంలో మంత్రులు వెనకబడి ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా చాలామంది మంత్రులకు ఖాతాలు లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నది. తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సరే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాత్రం ముందడుగు వేయలేకపోతున్నారు. మంత్రులు చాలామంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటం లేదు. యాక్టివ్ గా  ఉన్న మంత్రులు కూడా పెద్దగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయలేకపోతున్నారు.

దీని కారణంగా ఇబ్బందులు కార్యకర్తలు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వ్యక్తిగత ఇమేజ్ కోసం చాలామంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా ఇప్పుడు రాష్ట్రంలో వినబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే సోషల్ మీడియా విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ గా లేరో వాళ్లకు జగన్ నేరుగా క్లాస్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జరుగుతున్న వాస్తవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టలేకపోతున్నది.

దీనితో ప్రజల్లో కూడా తప్పుడు ప్రచారం ఎక్కువగా వెళ్తుంది అనే ఆవేదన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ఎక్కువగా బలోపేతం చేసుకుంటూ వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు సోషల్ మీడియా మీద ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం. అలాగే వైసీపీలో కీలక నేతలు అందరూ కూడా ఎమ్మెల్యేలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి అని ఇప్పటికే చెప్పారని మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత దీనికి సంబంధించి ప్రత్యేక టీంతో ఎమ్మెల్యేలకు మంత్రులకు క్లాసులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేసే విషయంలో కూడా సోషల్ మీడియాలో పెద్దగా మంత్రులు ఆసక్తి చూపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: