ఏపీలో పోలీసులను టార్గెట్ గా చేసుకుని టీడీపీ అధినేత, మాజీ చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కీలక అంశాల్లో పదే పదే పోలీసులను చంద్రబాబు నాయుడు లక్ష్యంగా చేసుకుని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే డీజీపీ గౌతమ్ సవాంగ్  పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అసంబద్ధ వ్యాఖ్యలను పోలీస్ సిబ్బంది మరియు పోలీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీస్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసారు.

పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో మీ పరిస్థితిని అర్థంచేసుకోగలం అని పోలీసులు మాట్లాడారు. మీ పోలీస్ వ్యతిరేకత కొత్త విషయం ఏమీ కాదు అన్నారు. పోలీసులను, డీజీపీని  బెదిరించి, కుల ప్రాంతీయ భావాలు రేకెత్తించి మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరు అని స్పష్టం చేసారు. ఎన్నికల ఓటమికి డీజీపీ, పోలీస్ శాఖ బాధ్యత అనడం భావ్యమేనా ?  అని ఆరోపించారు. నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో , పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు డీజీపీ పై కుల, ప్రాంతీయ భేదాలు ఆపాదిస్తూ ఆరోపణలు చేయడం గర్హనీయం అని మండిపడ్డారు.

మీ ఆరోపణలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి అని అన్నారు.  డీజీపీ  గౌతమ్ సవాంగ్   పై వ్యక్తిగత దూషణలకు దిగడం అత్యంత దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు. మీ ప్రభుత్వంలో కీలకమైన భాద్యతలు నిర్వహించినప్పుడు డీజీపీ గారి ప్రాంతం, కులం గుర్తుకు రాలేదా ?  అని నిలదీసారు. అంతర్జాతీయ స్థాయిలో సేవలు చేసిన డీజీపీ గౌతం సావంగ్ గారి నిబద్దత, నిజాయితీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు  తెలుసు, వారు గుర్తించారు అని కొనియాడారు. ఇకపైనైనా ఇటువంటి అసంబద్ద , నీతి మాలిన వ్యాఖ్యలు మానుకోక పోతే సంబంధిత చట్టాల ప్రకారం మీపై చర్యలకు కోర్టులను ఆశ్రయిస్తామని పోలీసులు చంద్రబాబు నాయుడుని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: