తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టబద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్  కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి... కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి మాట్లాడుతూ గెలిచిన మరుసటిరోజు ప్రగతిభవన్ కీ వెళ్లి నిరుద్యోగులకు భృతి, ఉద్యోగుల నోటిఫికేషన్ లు విడుదల చేయాలని వినతిపత్రం సమర్పిస్తా అని అమలు చేయకపోతే  అక్కడే దీక్ష చేస్తా అని చిన్నారెడ్డి స్పష్టం చేసారు.

రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఇవ్వలేదు  అని ఆయన ఆరోపించారు. తెలంగాణ లో నీళ్లు జగన్ కు, నియామకాలు ఆయన కుటుంబానికి, నిధులన్ని తన బంధువులకు తనకు ఇచ్చుకుంటున్నాడని ఆయన మండిపడ్డారు. మొన్న వరదల్లో అర్హులైన వారికి రూ. 10వేలు ఇవ్వలేదు అని ఆరోపణలు చేసారు. టిఎస్పిఎస్ సి లో 23లక్షల మంది ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు అని ఆయన అన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐ టి ఐ ఆర్ పై భాజపా, తెరాస పార్టీలు ఒకరిపై ఒకరు మొసలి కన్నీరు కారుస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

మంత్రి కేటిఆర్ కు సవాల్...మార్చ్ 8న పార్లమెంట్ ప్రారంభం అవుతుంది అని... తెలంగాణ పునర్విభజన చట్టం లో పెట్టిన అంశాలను అమలు చేయడానికి ఢిల్లీ లో జంతర్ మంతర్ వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐ టి ఐ ఆర్ పై, గిరిజన యూనివర్సిటీ పై ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం అని సవాల్ చేసారు. పివి గారి ఆత్మ గౌరవం పెరగాలంటే పివి కుమార్తె వాణి దేవి...కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి చిన్న రెడ్డి కి మద్దతు ఇవ్వాల్సింది అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: