పెట్రోల్, డీజిల్ ధర విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాల్లో  భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోసం కొన్ని హామీలను కూడా ఇస్తూ వస్తున్నది. అయితే ఇప్పుడు వచ్చే  వార్తల ఆధారంగా చూస్తే కర్ణాటక రాజధాని బెంగళూరులో... అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు ధరల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా కనబడలేదు. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నా సరే ఇక్కడి ముఖ్యమంత్రులు మాత్రం ఆ విషయంలో ముందడుగు వేయలేకపోతున్నారు. ఒకవేళ ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్ కీలక నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొత్త కొత్త వినూత్న ఆలోచనలతో యువత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా విమర్శలను పక్కనపెట్టి కొంతమంది ప్రతిపక్ష నేతల సలహాలను కూడా రెండు రాష్ట్రాల్లో తీసుకుంటే బాగుంటుంది అనే సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు పెరగడం పై తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది. కర్ణాటకలో ఈ విధానం  వచ్చేసింది. కాబట్టి సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గించడం ఎలాగూ సాధ్యం కావడం లేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అయినా సరే ప్రజలకు మంచి చేస్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: