భారత మాజీ క్రికెటర్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే ప్రస్తుతానికి అయిన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ విషయంలో స్పష్టత రావడం లేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ ఆయనను దత్తపుత్రుడిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

వాళ్ళిద్దరి మధ్య కొన్ని వివాదాలు వచ్చినా సరే ఆ తర్వాత అవి పరిష్కరించకున్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు గంగూలి విషయంలో భారతీయ జనతాపార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. పశ్చిమబెంగాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కాస్త ఎక్కువగానే గంగూలీ మీద ఫోకస్ చేసింది. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. పశ్చిమబెంగాల్లో ఎన్నికల షెడ్యూలు కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే రాజకీయ ప్రయాణంపై చాలా చర్చలు ఉన్నాయి, ఒకవేళ గంగూలి రాజకీయాల్లోకి వస్తే మాత్రం అధికార పార్టీకి ఇబ్బంది ఉంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా చాలా మంది మాత్రం గంగూలి అధికార పార్టీ లోకి వెళ్ళే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు చర్చలు జరుపుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి రాకపోతే మాత్రం మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి దాదాపుగా అయిదారేళ్ల పట్టే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: