బీజేపీ వ్యూహాత్మ‌క అడుగుల‌ను అంతే వేగంగా తిప్పి కొడుతూ దీదీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న విష‌యం తెలిసిందే. వెర‌సి ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో ఎన్నిక‌ల శంఖారావం ఇంకా మోగ‌క ముందే తార‌స్థాయి రాజ‌కీయం జ‌రుగుతోందా అన్న‌ట్లుగా ఉంది ప‌రిస్థితి. ఇక తాజా విష‌యానికి వ‌స్తే మ‌మ‌త ముందుగా ప్ర‌క‌టించిన విధంగానే  పంతానికే పచ్చజెండా ఊపారు. నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నానని శుక్రవారం అధికారికంగా ఆమె ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆమె భవానీపూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడానికి ఈసారి మాత్రం ఆమె నందిగ్రామ్‌ను ఎంచుకున్నారు.


నందిగ్రామ్‌ నియోజకవర్గానికి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఈనెల 11న నందిగ్రామ్‌లో తన నామినేషన్ వేయనున్నారు. శివ భక్తురాలైనమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ శివరాత్రి రోజును నామినేషన్ వేసేందుకు ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఇటీవలే బీజేపీలో చేరిన స్ట్రాంగ్ మ్యాన్ సుబేందును, బీజేపీని రాజకీయంగా ఎదుర్కోడానికి ఈసారి ఆమె నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ పోటీకి దిగుతున్నారు. బెంగాల్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్గెస్ట్‌ బాటిల్‌గా నిలవనున్న ఈ నియోజకవర్గంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్యే హోరాహోరీ పోటీ జరగనుంది.


టీఎంసీ నుంచి రాజీనామా చేసి తమ పార్టీలో చేరిన సువేందును మమతాకు పోటీగా దించాలని బీజేపీ భావిస్తోంది. దీనిపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచనలు జరుపుతోంది. ఇదిలా ఉండ‌గా మరోవైపు 294 స్థానాలకు గాను ఆమె అభ్యర్థులను ప్రకటించారు. అందరూ 80 సంవత్సరాల లోపు వయస్సు వారే. అందులో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది షెడ్యూల్డ్ క్యాస్ట్, 17 మంది షెడ్యూల్ ట్రైబ్ వారు ఉన్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. టీఎంసీ పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ 291 మందితో తొలి జాబితా విడుదల చేశారు. తాను నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నట్టు మమత ప్రకటించారు. తొలి జాబితాలో 50 మంది మహిళలకు, 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలకు టీఎంసీ టికెట్లు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: