ఎన్నికలకు నెలరోజుల ముందు కేరళ సీఎం పినరయ్ విజయన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గోల్డ్ స్కామ్‌లో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ సీఎం విజయన్‌పై సంచలన ఆరోపణలు చేయ‌డంతో రాజ‌కీయంగా ఆయ‌న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేరళ గోల్డ్ స్కామ్‌లో సంచలన మలుపు తిరిగింది. ఈ కుంభకోణంలో సీఎం పినరయి విజయన్‌కు సంబంధం ఉందంటూ నిందితురాలు స్వప్న సురేశ్‌ బాంబు పేల్చింది. కేవలం సీఎం మాత్రమే కాదు ముగ్గురు క్యాబినెట్‌ మినిస్టర్లు సైతం గోల్డ్‌ స్కాం వెనక ఉన్నారంటూ నోరు విప్పింది. ఇందులో కేరళ అసెంబ్లీ స్పీకర్‌ కూడా ఉన్నారంటూ చెప్పడం ఈ స్కామ్‌లో మరో ట్విస్ట్. అసలే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధంగా మారింది.


అక్రమ బంగారం, డాలర్ల తరలింపులో సీఎం విజయన్‌ హస్తం ఉన్నట్లు తమ విచారణలో వెల్లడించినట్లు తెలిపారు కస్టమ్స్ అధికారులు పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో  సీఎంతో పాటు కేరళ స్పీకర్, మరో ముగ్గురు మంత్రులు కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్లు తెలిపారు స్వప్న సురేశ్ అధికారుల‌కు వెల్ల‌డించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదే విష‌యంపై ఇప్పుడు హాట్ హాట్‌గా చ‌ర్చ జ‌రుగుతోంది.  కేరళ గోల్డ్‌ స్కామ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. కోట్ల రూపాయల విలువజేసే భారీ గోల్డ్‌ స్కామ్‌ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.జులై 5న త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌కు దుబాయ్‌ నుంచి వచ్చిన కార్గో విమానంలో 30 కేజీల బంగారం పట్టుబడింది.


అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. సాక్షాత్తూ సీఎం కార్యాలయం సిబ్బంది సాయంతోనే దుబాయ్‌ నుంచి త్రివేండ్రానికి బంగారం స్మగ్లింగ్‌ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్మగ్లింగ్‌ కేసులో సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్‌కు ప్రిన్సిపల్‌ సెక్రటరీ శివశంకర్‌ అండగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. స్వప్న సురేశ్‌ను కేసు నుంచి తప్పించడానికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని కూడా ఆరోపణలొచ్చాయి.  కేరళ గోల్డ్ స్కాం కేసులో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్నా సురేష్ , సందీప్ నాయర్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించిన ఎన్ఐఏ.. తాజాగా సీఎం మాజీ ముఖ్య కార్యదర్శి ఎం శివశంకర్‌ని ప్రశ్నిస్తోంది. అతని నుంచి కొన్ని వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: