ఆంధ్రప్రదేశ్ లో మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించిన ఫలితాలు వెలువడినాసరే ఎవరికి వాళ్ళు తాము గెలిచామని లాగా స్టేట్మెంట్ లు ఇచ్చుకోవడంతో పాటు అది పార్టీలు గుర్తులతో జరిగిన ఎన్నికలు కాకపోవడంతో ఎవరు ఎన్ని స్థానాలు అధికారికంగా గెలిచారు అనేది ఎప్పటికీ చెప్పలేని బహిరంగ రహస్యమే. వాస్తవానికి అధికారపక్షం అందరికంటే ఎక్కువ స్థానాలు సాధించింది. టీడీపీ కూడా వాళ్ళకు దగ్గరగా స్థానాలు సాధించామని చెప్పుకుంటోంది.. జనసేన బీజేపీ సైతం పరువు నిలబెట్టుకునే స్థాయిలో సీట్లు సాధించామని చెప్పుకున్నాయి. 

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇంకా మున్సిపల్ ఎన్నికలకు మూడు రోజుల సమయం ఉంది.. దీంతో ఇప్పుడు ఈ నగర ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు రకాల సర్వే సంస్థలు రంగంలోకి దిగి సర్వే చేస్తున్నాయి. దీంతో కొన్ని ప్రీ పోల్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి, అయితే పత్రికాముఖంగా ఎక్కడ వెల్లడించక పోయినా రాజకీయ వర్గాలలో మాత్రం ఈ చర్చలు జోరుగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం కార్పొరేషన్ కి సంబంధించిన సర్వేలు జరిగాయి. 

ఈ సర్వేలలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఎందుకంటే రాష్ట్రం వేరు పడ్డాక అనంతపురం కార్పొరేషన్ కు ఇవే మొట్టమొదటి ఎన్నికలు. గతంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ కు తెలుగుదేశం నుంచి మదమంచి స్వరూప మేయర్ గా పనిచేశారు. ఇప్పుడు ఇక్కడ 50 డివిజన్ లలో పోటీ జరుగుతోంది. అయితే సర్వే లెక్కల ప్రకారం 32 డివిజన్ లలో వైసీపీ గాలి వీస్తోందని అంటున్నారు అలాగే ఎనిమిది చోట్ల టీడీపీ బలంగా ఉందని చెబుతున్నారు. ఒక పది డివిజన్ లలో మాత్రం హోరాహోరి పోరు తప్పదని చెబుతున్నారు. అలాగే 32 చోట్ల అంటే కొన్ని డివిజన్లలో వైసీపీ రెబల్ అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం లేకపోలేదని సర్వేలలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: