అదేంటోగాని ఉప ఎన్నిక అనగానే ప్రస్తుతం అధికార పార్టీలో కొత్త అలజడి మొదలవుతున్నట్లు  తెలుస్తోంది. ఎందుకంటే దుబ్బాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా  అక్కడ ఉప ఎన్నికలు జరుగగా ఇక అనుకోని విధంగా ఎవరూ ఊహించని రీతిలో బిజేపి విజయాన్ని సాధించి అధికార పార్టీకి చెందిన విషయం తెలిసిందే.  ఇక ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే అటు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కూడా అనారోగ్యంతో మృతి చెందారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక అనివార్యం గా మారిపోయింది.



 మరికొద్ది రోజుల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లు గానే మరోసారి  నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గెలవాలని బీజేపీ  పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక అదే సమయంలో ఈసారి కూడా నాగార్జునసాగర్ తామే గెలుస్తామని ధీమాతో ఉంది టిఆర్ఎస్ పార్టీ.  అయితే టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తోంది. బిజెపి కాంగ్రెస్ పార్టీలను తట్టుకుని మళ్ళీ ఈ సీట్లో గెలవాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్ తీరును తప్పుబడుతూ తెలంగాణలో ఎదుగుతున్న బిజెపి పార్టీ టిఆర్ఎస్ కు అస్సలు సమస్యగా మారబోతోంది.



 అదే సమయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికీ ఇవ్వబోతున్నది  అనేది కూడా ఆసక్తికరంగా మారింది.  ఇకఎమ్మెల్యే కుటుంబంలోని వారికి టికెట్ ఇస్తారని ప్రచారం కూడా ఊపందుకుంది. దివంగత ఎమ్మెల్యే తనయుడు నోముల భగత్ లేదంటే ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డికి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. భగత్ చిన్నపరెడ్డి లు  కాకుండా ఇప్పుడు యాదవ నేతలకు కూడా కాల్స్ వెళ్లినట్లు సమాచారం. గురవయ్య యాదవ్, రంజిత్ యాదవ్ ఈ లిస్టులో ఉండగా బీజేపీ టికెట్ ఇవ్వాలని భావిస్తున్న అంజయ్య యాదవ్ కి  కూడా టిఆర్ఎస్ నుంచి ఫోన్ వెళ్లినట్టు సమాచారం.  ఇక ఎవరికి టికెట్ దక్కుతుంది అని తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: