సాధారణంగా కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు జనాల ఓట్ల కోసం ఏమేమో హామీలు ఇచ్చి జనాలను నమ్మించి వారి ఓట్లు సాధిస్తారు. పాపం అమాయకపు జనాలు వారి మాటలు నమ్మి తమకేదో చేస్తారని నమ్మి ఆ రాజకీయ నాయకులకు ఓట్లు వేస్తారు. వారిని గెలిపిస్తారు. కానీ ఆ రాజకీయ నాయకులు మాత్రం తాము ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చకుండా ఉంటారు.అలాంటి రాజకీయ నాయకులు సమాజంలో ఉంటారు.కాని ప్రజలకు తెలుసు ఎప్పుడు ఏం చెయ్యాలి అనేది. వాళ్ళు నమ్మించి మోసం చేసిన వారి మాటలను ప్రజలు ఎప్పుడు మరిచిపోరు..ఒక వేళ తాము ప్రవేశ పెట్టిన పథకాలు ఇంప్లిమెంట్ చేసిన కాని అవి ఒక్కోసారి వర్క్ అవుట్ అవుతాయి. ఒక్కోసారి అవ్వవు. ఇక అవి అవ్వడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.


జనం ఇచ్చిన తీర్పులో ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు... వాళ్లకు ఎవరు బాగా పరిపాలన చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారు. ఇక అతకముందు విషయానికి వస్తే దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులకు ఆయన్ని గెలిపించి సీఎం ని చేశారు. ఆయన చనిపోయిన తరువాత కాంగ్రెస్ సరిగ్గా పరిపాలన చెయ్యలేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఆయన్ని గెలిపించి తెలుగు దేశం పార్టీని గెలిపించారు. ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. ఇక ఆయన కూడా ఏమి చేయలేనందువలన వైఎస్సార్ పార్టీని గెలిపించి జగన్ ని సీఎం చెయ్యడం జరిగింది. ఇక జగన్ సరిగ్గా పాలన చెయ్యకపోతే తరువాత జగన్ ని గెలిపించారు. ఒకవేళ మంచిగా పాలిస్తే మళ్ళీ జగన్ నే సిఎం చేసే అవకాశాలు స్పష్టంగా వున్నాయి. కాబట్టి జనాలు ఇచ్చే తీర్పులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని ఇక్కడ పూర్తిగా అర్ధమవుతుంది. కాబట్టి డాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు చక్కగా పరిపాలించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: