దేశంలో నిత్యావ‌స‌ర ధ‌ర‌లు ఆకాశాన్ని తాక‌డంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల పై పెట్రోల్ మంట మ‌రింత ప్ర‌భావాన్ని చూపుతుంది. పెట్రోల్ ధ‌ర‌లు వంద‌కు చేర‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రంలో ఉన్న మోడీ స‌ర్కార్ పై ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం ఇది గ‌త ప్ర‌భుత్వాల వైఫ‌ల్య‌మ‌ని...అందుకే ఇప్పుడు ద‌ర‌లు పెరుగుతున్నాయని వాదిస్తోంది. ఇక పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌టం పై సోష‌ల్ మీడియాలోనూ నెటిజ‌న్లు త‌మ స్టైల్ స్పందిస్తున్నారు. మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. ఇక తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవ‌తున్న నేప‌థ్యంలో తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ధ‌ర‌ల పెంపు పై స్పందించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి 'ధర్మసంకట్ సందిగ్దంగా మారాయ‌ని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల కారణం గా పౌరులపై భారం పడుతున్నట్లు నిర్మ‌లా సీతారామ‌న్ అంగీకరించారు. ప్రజలపై పడే భారాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అంతే కాకుండా ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  పెట్రోల్ తో కేంద్రానికి  కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తుందని అన్నారు. ఇప్పుడదే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు నిర్మల సీతారామన్ పేర్కొంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ఏకైక మార్గం కేంద్రం, రాష్ట్రాలు చర్చలు జరపడమేనని ఆమె అన్నారు. ఇక ఇది వ‌ర‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇదే మాట చెప్పారు. "కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయ చర్చలు అవసరం. వీలైనంత త్వరగా పన్నులు తగ్గించడం చాలా ముఖ్యం అంటూ వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధ‌ర‌ల‌‌పై ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటే వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేంద్రమే ధ‌ర‌లు పెంచుతుంద‌ని ఆరోప‌ణ‌లు చేస్తుంటే కేంద్రం రాష్ట్రాల‌పై నింద‌లు మోపుతుంది. మోత్తానికి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య సామాన్య మాన‌వుడు న‌లిగిపోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: