ప్రస్తుతం వాట్సప్ వాడకం ఎంతలా  పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాట్సప్ అకౌంట్ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  రోజురోజుకు వాట్సాప్ వాడకం పెరిగిపోతోంది. అటు వాట్సాప్ లో ఎన్నో రకాల కొత్త ఫీచర్లు కూడా వెలుగులోకి వస్తున్న తరుణంలో...  ఎంతోమంది వాట్సాప్ వాడటానికి మరింత ఆసక్తి చూపుతున్నారు . ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా వాట్సప్లో మాట్లాడుకోవడానికి వీడియో కాల్ లో కలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారూ నేటి రోజుల్లో.



 ఇకపోతే ఈ మధ్యకాలంలో వాట్సాప్ ఎంతోమందిని  ఇబ్బందులకు గురి చేస్తుంది. వాట్సాప్ లో కొన్ని రకాల మెసేజ్లు తరచూ వైరల్ గా మారి పోతూ ఉండటం లాంటి ఘటనలు అందరికీ ఎదురయ్యే ఉంటాయి. ఎన్నో రకాల వార్తలు  వాట్సాప్ లో వైరల్ గా మారి పోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏ  మెసేజ్ ను నమ్మాలి అన్నది కూడా తెలియక అయోమయ స్థితిలో పడిపోయారు జనాలు. ఈ మధ్యకాలంలో వాట్సాప్ లో వైరల్ గా మారిపోయిన ఫేక్ న్యూస్ కనిపెట్టేందుకు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు అనే విషయం తెలిసిందే..



 ఇప్పటికే వాట్సాప్ లో ఎన్నో రకాల తప్పుడు వార్తలు వైరల్ గా మారగ ఇక ఇప్పుడు మరో తప్పుడు వార్త జనాల్ని బురిడీ కొట్టించేందుకు  సిద్ధమైంది. ఉమెన్స్ డే సందర్భంగా కేవలం స్త్రీల కోసం ఫ్రీ ఆఫర్ అంటూ ఒక లింక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ బ్రాండ్ కు చెందినటువంటి బ్రాండెడ్ షోస్  ఉచితంగా పొందండి అంటూ ఒక ఆఫర్ అందుబాటులో ఉంది. ఇలా సారాంశం కలిగిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతూ ఉండగా ఎంతోమంది ఇక ఈ వార్త నమ్మి మోసపోతున్న ఘటనలు  కూడా తెరపైకి వస్తున్నాయి. అందుకే వాట్సప్ ఎప్పటికప్పుడు వినియోగదారులను హెచ్చరిస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: