కరోనా కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ చిన్నా, భిన్నం అయిన సంగతి తెలిసిందే.. కొన్ని నెలలు పాటు మనుషుల మద్య మాటలు లేవు, ఎప్పుడు మహమ్మారి ఎవరిని కాటేస్తుందో అన్న భయం ప్రజల్లో కొనసాగుతుంది.దీనివల్ల వ్యాపారాలు మూసుకుపోతున్నాయి. అలాంటి ఇబ్బందులు కలగకూడదనుకున్న ఒక సెలూన్ యజమాని ఏం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మాములుగా గడ్డం గీయించుకోవాలంటే 30 లేదా 50 రూపాయలు ఖర్చు అవుతుంది. పెద్ద షాపుల్లో అయితే రెండు వందల నుంచి మూడువందల వరకు ఉంటుంది. అయితే వాటిలో మామూలు బ్లేడు ఉంటుంది. ఇక్కడ ఒక అతను కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు..



వివరాల్లోకి వెళితే.. కొత్తగా మొదలెట్టిన సెలూన్ బాగా నడవడానికి అతడు చేసిన ప్రకటన బాగా పనిచేసింది. అక్కడకి వచ్చే కస్టమర్ల కోసం బంగారు బ్లేడుని చేయించాడు. బంగారు బ్లేడుతో షేవింగ్ చేయడాన్ని ఒక గర్వంగా భావించే అందరూ తన సెలూన్ కి వస్తారని అనుకున్నాడు.. అందరికంటే కాస్త భిన్నంగా గొప్పగానే ఉంటుంది.. ప్రజలు ఆ విధంగా ఆలోచించి అయినా తన సెలూన్‌కు వస్తారని భావించాడు. ఈ మేరకు తన సెలూన్‌లో కొన్ని మార్పులు చేసి, స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా బంగారు రేజర్‌తో షేవింగ్‌ సేవలను ప్రారంభించాడు..


పుణెలో ఉన్న అవినాష్ బోరుండ్ల అనే ఈ వ్యక్తి ఇలాంటి కొత్తరకం ఆలోచనతో వినియోగదారులని ఆకర్షిస్తున్నాడు.అవినాష్‌ 80 గ్రాముల బంగారంతో ఒక రేజర్‌ చేయించాడు. ఇందుకోసం రూ.4లక్షలు ఖర్చయిందట. బంగారు రేజర్‌తో షేవింగ్‌ చేయించుకోవడం అంటే..కాస్త భిన్నంగా.. గొప్పగానే ఉంటుంది. ఈ మేరకు తన సెలూన్‌లో కొన్ని మార్పులు చేసి, స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా బంగారు రేజర్‌తో షేవింగ్‌ సేవలను ప్రారంభించాడు.ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ప్రస్తుతం అతడి సెలూన్‌ ముందు క్యూ కడుతున్నారు. బంగారు రేజర్‌తో షేవింగ్‌ చేసినందుకు అవినాష్‌ రూ.100 వసూలు చేస్తున్నాడు. అంత ఇవ్వలేకపోయినా కస్టమర్‌ ఆనందం కోసం తక్కువ మొత్తానికి కూడా షేవింగ్‌ చేస్తున్నాడట..

మరింత సమాచారం తెలుసుకోండి: