పెళ్లి అంటే అమ్మాయి లో అలజడి మొదలవుతుంది.. వేరే ఇంటికి ఎలా వెళ్ళాలో .. అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో అనే భయం అందరికీ ఉంటుంది. పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి అదే దిగులు తో ఉంటారు. అప్పగింతలు టైమ్ లో మాత్రం కుటుంబ సభ్యుల తో పాటుగా ఎడ్చేస్తారు. ఇంకా సున్నిత మనస్కులు అయితే చెప్పాల్సిన పనిలేదు.. పెళ్లి అనేది కూడా  మర్చిపోయి హాస్టల్ కు వెళ్ళే పిల్లలు లాగా  వెక్కి వెక్కి ఏడుస్తారు. ఇక్కడ కూడా అలాంటి ఘటనే ఎదురైంది. పెళ్లి అప్పగింతలు రోజు బాగా ఏడ్చింది.. అత్త వారింటికి వెళ్తుంది అనగా ఒక్కసారి గా కుప్ప కూలిపోయింది.


వివరాల్లోకి వెళితే.. ఒడిసా రాష్ట్రం లోని సోనేపూర్ జిల్లా లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుక లో విషాదం నెలకొంది. వివరాల ప్రకారం..మురళి సాహూ, మేనకా దంపతుల కుమార్తె గుప్తేశ్వరి సాహూకు రోసీ టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్‌ అనే యువకుడి తో గురువారం రాత్రి వివాహం జరిపించారు. మరుసటి రోజు ఉదయం వధువును అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యం లో అప్పగింతల కార్యక్రమంలో నవ వధువుకు వీడ్కోలు పలుకుతుండగా ఒక్కసారిగా ఆమె సృహ కోల్పోయింది.


వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్ష చేసిన వైద్యులు ఆమె చనిపోయినట్లు తెలిపారు. అప్పగింతల్లో అతిగా ఏడ్వడం వల్ల గుండెపోటు వచ్చిందని, దీంతో వధువు చనిపోయినట్లు పేర్కొన్నారు. పెళ్లయిన కొద్ది గంటల్లోనే వధువు చనిపోవడం తో కుటుంబ సభ్యులు సహా బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నీరసం వల్ల కళ్లు తిరిగి పడి పోయిందని భావించామని, ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు. వధువు మృతి తో రెండు కుటుంబాల్లో తీరని విషాదం ఏర్పడింది. ఈ ఘటన వల్ల  స్థానికంగా విషాద ఛాయలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: