పురపాలక సంఘాలకు జరుగుతున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వారి సామర్థ్యం ఎంతమేరకు పనిచేస్తుందనే విషయం ఈ ఎన్నికలతో తేలిపోనుంది. గల్లీలో విజయవంతమైతేనే ఢిల్లీలో కూడా విజయవంతమవుతారని రాజకీయ సామెత ఉంది. దానికి అనుగుణంగా సొంత గల్లీల్లో కూడా తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి నేతలంతా చెమటోడుస్తున్నారు.

రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్ష
కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో తిరుమల తిరుపతి దేవస్థానం  మాజీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్యాదవ్, ప్రొద్దుటూరులో పార్టీ ఇన్చార్జి జీవీ ప్రవీణ్కుమార్రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. అభ్యర్థులను గెలిపించుకునే కీలక బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. పట్టణ ఓటర్ల మనసు గెలిచి అభ్యర్థులను గెలిపించుకోవడంలో వారి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.  పోలీసుల ఒత్తిళ్లు, రాజకీయ బెదిరింపులు  వచ్చినా ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో 10 సర్పంచ్ స్థానాలను గెలిపించుకున్న పుట్టా అధికార పార్టీని బలంగా ఢీకొడుతున్నారు. పోటీచేసే అభ్యర్థులను అజ్ఞాతంలోకి తీసుకెళ్లి నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత ప్రచారంలోకి దింపడంలో విజయవంతమయ్యే చరిత్ర ఉన్న పుట్టా మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకుని పట్టు నిలుపుకుంటారా? ఈ ఎన్నికలు ఆయనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎలా ఉపయోగపడతాయో?  లేదో? వేచిచూడాలి!!.


ప్రొద్దుటూరులో ‘ఉక్కు’ బలం పనిచేసేనా!
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జ్ జి.వి.ప్రవీణ్కుమార్రెడ్డికి ఇన్చార్జ్గా ఈ మున్సిపల్ ఎన్నికలు కొత్త. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిని  ఆరు నెలల క్రితమే తొలగించి అధినేత చంద్రబాబు ఇన్చార్జ్ బాధ్యతలు ఉక్కు ప్రవీణ్కు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో సరైన వ్యూహంతో ముందుకు వెళ్లకపోయినా మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 40 వార్డుల్లో 9 ఏకగ్రీవం కాగా 31 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. చైర్మన్ అభ్యర్థి ముక్తియార్తో కలిసి ప్రచారంలో ముందుకెళ్తున్నా మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకుని చైర్మన పీఠం దక్కించుకోవడంలో ఏ మేరకు సఫలమవుతారో వేచి చూడాలి!!.

మరింత సమాచారం తెలుసుకోండి: