తెలంగాణ కాంగ్రెస్‌కు పున‌రుత్తేజం తీసుకురావ‌డంలో పీసీసీ రేసులో ఉన్న పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బిజిబిజిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తూ జ‌నాల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చిన్నారెడ్డిని గెలిపించుకునే బాధ్య‌త‌ల‌ను భుజ‌స్కందాల‌పై వేసుకున్నారు. అయితే ఈసంద‌ర్భంగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల్లోని కొన్ని విశ్లేష‌కుల‌కు కూడా అంతు ప‌ట్ట‌డం లేద‌ని స‌మాచారం. వైఎస్ ష‌ర్మిల‌ను టార్గెట్ చేస్తూ ఆయ‌న మాట్లాడుతుండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఆమెకు ఇక్క‌డ పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌ద‌ని విశ్లేష‌కులు, రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.


 అయితే పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని పార్టీలు కూడా అడ‌ప‌ద‌డ‌పా స్పందిస్తున్నాయి. ముఖ్యనేతలెవరూ షర్మిల కొత్త పార్టీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఒకవేళ మాట్లాడినా.. ఏదో రెండు మాటలతో సరిపెట్టారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆమె డ్రామాలు చేస్తోందంటూ షర్మిలపై విమర్శలు చేయడం.. దానికి షర్మిల వర్గం నుంచి కౌంటర్ కూడా రావడం జరిగిపోయింది. అయితే రేవంత్ రెడ్డి త‌రుచూ అనవసరంగా షర్మిలను విమర్శించి ఆమె గురించి చర్చ జరిగేలా చేశారనే ప్రచారం సాగుతోంది. నిజానికి తెలంగాణలో రెడ్డి వర్గం రేవంత్ రెడ్డి వైపు వెళ్లకుండా ఉండేందుకు కేసీఆర్ షర్మిలను రంగంలోకి దింపారని కొందరంటే.. కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడం కోసం ఆమెను బీజేపీ రంగంలోకి దించిందని విశ్లేషిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఇప్ప‌టికైనా అన్నీ తెలుసుకుని మ‌స‌లుకుని అన‌వ‌స‌ర ప్రాధాన్య అంశాల‌ను త‌గ్గించుకుంటారో వేచి చూద్దాం..!


ఇదిలా ఉండ‌గా పీసీసీ సీటుపై ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. రేసులో రేవంత్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. శ్రీద‌ర్ బాబు, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి, జగ్గారెడ్డితో పాటు బీసీ కోటాలో పొన్నం ప్రభాక‌ర్, ద‌ళిత కోటాలో మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ, ఏఐసీసీ సెక్రట‌రీ సంప‌త్ తీవ్ర ప్రయ‌త్నాలు చేస్తున్నారట. భ‌విష్యత్‌లో పార్టీ బ‌తికి బ‌ట్టక‌ట్టాలంటే పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిందేనని అంటున్నాయి. ఉత్తమ్ నాయ‌క‌త్వంలో ప్రజా ఉద్యమాల‌కు కూడా చాన్స్ లేకుండా పోయింద‌నీ, టీఆర్ఎస్‌తో టగ్ ఆఫ్ వార్ చేసే పరిస్థితి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: