ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అటు ఎన్ని కఠిన  చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దీంతో మహిళల జీవితం రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతుంది.  అయితే ఈ మధ్యకాలంలో ఎంతోమంది మైనర్ బాలురు సైతం అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న కేసులు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.  చట్ట ప్రకారం మన దేశంలో మైనర్ బాలురు తప్పులు చేస్తే శిక్షలు తక్కువగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 కొన్ని కొన్ని సార్లు శిక్షల నుండి మినహాయింపులు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే భారతదేశ చట్టంలో ఉన్న లొసుగులను అడ్డంపెట్టుకుని కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు దారుణాలకు పాల్పడుతుంటారు.  అయితే మైనర్ బాలురు అయినా సరే తప్పులు చేస్తే మాత్రం శిక్ష నుంచి తప్పించుకోలేరు అని పలు సందర్భాల్లో న్యాయస్థానాలు చెబుతూ ఉండడమే కాదు అలాంటి తరహా తీర్పులు కూడా ఇస్తూ ఉంటారూ  అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో కూడా కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది.



  బాలుడికి మైనార్టీ తీరేవరకూ చూసి ఆ తర్వాత కోర్టు రెండేళ్ల తర్వాత శిక్ష ఖరారు చేసింది. ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష ఖరారైంది. ఏలూరు మండలం తంగెళ్ళమూడి పంచాయతీలో మైనర్ బాలుడు  2018 జనవరి లో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. 18 ఏళ్లు నిండే వరకు చూసి చివరికి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నేరం రుజువు కావడంతో అతనికి అదనపు జువైనల్ కోర్టు న్యాయమూర్తి రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అయితే జడ్జ్ తీర్పుతో  మైనర్లు అయినప్పటికీ కూడా ఎక్కడ తప్పించుకోలేరు అన్నది అర్థం అవుతుంది అని అంటున్నారు పలువురు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: