ఏపీ లో జరుగుతున్న కార్పొరేషన్ , మునిసిపల్ ఎన్నికలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొత్తం పన్నెండు కార్పోరేషన్ లతో పాటు 75 నగర పంచాయతీలు , మున్సిపాలిటీలు లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 14 వ తేదీ ఉదయం 10 గంటల లోపు ఏ నగరంపై ఏ పార్టీ జెండా ఎగురుతుంది అన్న‌ది క్లారిటీ ఉంటుంది. ఇదిలా ఉంటే మొత్తం ఎన్నికలు జరుగుతున్న 12 కార్పొరేషన్లలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది ? అనే దానిపై ఇప్ప‌టికే పలు సర్వేలు వెలువడుతున్నాయి.

నిన్న మొన్నటి వరకు ఉన్న అంచనాల ప్రకారం రెండు , మూడు కార్పొరేషన్లు మినహా మిగిలిన అన్ని కార్పొరేషన్లో వైసిపి ఏకపక్షంగా విజయం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. తాజా సర్వేల ప్రకారం మొత్తం 12 కార్పొరేషన్లలో నూ వైసీపీ జెండా ఎగిరేలా ఉందని తెలుస్తోంది. విజయవాడ - గుంటూరు - వైజాగ్‌ లాంటి చోట్ల గట్టిపోటీ ఉన్నాకూడా వైసిపి ఎడ్జ్ లోకి వచ్చేసిందని తాజా సర్వేలు చెబుతున్నాయి.

విచిత్రమేంటంటే ఏలూరు - విశాఖపట్నం - విజయవాడ - గుంటూరు లాంటి కార్పొరేషన్లు మినహా మిగిలిన చోట్ల టిడిపి డబుల్ డిజిట్ కు చేరుకోవడం కూడా కష్టమని తాజా సర్వేలు చెబుతున్నాయి. మరి ఈ సర్వేల అంచనాలు ఎంత వ‌ర‌కు నిజమవుతాయి లేదా అన్నది ఈ నెల 14 వ తేదీ వ‌ర‌కు ఎదురు చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: