ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు కూడా బరువుని సమతుల్యం గా ఉంచుకునేందుకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డైటింగ్ అనే పేరుతో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఈ మధ్య కాలం లో ఎక్కువమంది ఇలా డైటింగ్ పేరుతో పొట్ట మాడ్చుకోవడం లాంటివి చాలానే చూస్తూ ఉన్నారూ.  ఎంత ఆకలి వేసినప్పటికీ  కేవలం కొంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ వుంటారు చాలామంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అయితే మరింత మితం గా ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.



 అయితే ఇక పగటి సమయంలో ఎలా ఆహారం తీసుకున్నప్పటికీ రాత్రి పడుకునే సమయంలో మాత్రం చాలా మంది మితంగా ఆహారం తీసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎంత ఆకలి వేసినప్పప్పటికీ   తక్కువ మొత్తంలో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.  ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు రాత్రి  తీసుకున్న ఆహారం కాస్త సరిపోక అర్ధరాత్రి సమయంలో ఆకలి వేస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఆకలి తో సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతూ వుంటారు చాలామంది.



 అయితే ఇలా డైటింగ్ చేస్తూ రాత్రి సమయంలో ఆహారం తక్కువగా తీసుకుంటూ అర్ధరాత్రి ఆకలి మేడం తో ఇబ్బందులు పడుతున్న వారు.. త్వరగా జీర్ణం అయిపోయి.. తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం ఎంతో ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. ఆ కాలంలో దొరికే పండ్లు తినడం వల్ల కడుపు నిండడం తో పాటు హాయిగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా నూనెలో వేయించని  మరమరాల ను తినడం కూడా మంచిది అని అంటున్నారు. అంతేకాకుండా జొన్నలు రాగులు కొర్రలతో చేసిన చిప్స్ తింటే  అటు పోషకాలు అందడంతో పాటు త్వరగా జీర్ణమై పోయి హాయిగా నిద్ర పడుతుంది అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: