ఏపీలో మొత్తం 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండగా ఇందులో ఇప్పటికే వైసీపీ ఖాతాలో కడప - చిత్తూరు - తిరుపతి కార్పొరేషన్లు చేరాయి. ఈ మూడు కార్పొరేషన్లలో మెజార్టీ డివిజన్లలో వైసిపి అభ్యర్థులు కార్పొరేటర్లు గా ఏకగ్రీవం కావడంతో మిగిలిన డివిజన్లకు జరుగుతున్న ఎన్నికలు కేవలం నామమాత్రంగానే ఉన్నాయి. రాయలసీమలోని పలు కార్పొరేషన్లో టిడిపి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సీమ‌ లోని కార్పొరేషన్ల‌లో టిడిపికి గెలుపు కాదు కదా... కనీసం డబుల్ డిజిట్ కార్పొరేటర్ స్థానాలు వచ్చినా గొప్ప అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కేంద్రమైన కడప కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ 50 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ఎన్ని డివిజన్లు గెలుచుకుంటుంద‌న్న దానిపై ఇప్పటికే రెండు మూడు సర్వేలు చూడగా... ఈ మూడు సర్వేల్లోనూ టిడిపి రెండు కార్పొరేటర్ స్థానాలకు మించి గెలవదని తేలింది. ఒక సర్వే అయితే ఏకంగా వైసిపి 49 డివిజన్లు గెలుచుకుంటుందని.. ఆ ఒక్క డివిజ‌న్ విషయంలోనూ గట్టి పోటీ ఉంటుందని చెప్పింది.

దీన్ని బట్టి చూస్తే రేపటి ఫలితాలు రోజున వైసిపి మొత్తం 50 డివిజన్లు వైసీపీ ఏకపక్షంగా గెలుచుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అర్థమవుతోంది. క‌డ‌ప గ‌డ్డ‌పై ఒకే ఒక్క కార్పోరేట‌ర్ స్థానాన్ని నిల‌బెట్టుకుంటేనే టీడీపీ సంచ‌ల‌నం న‌మోదు చేసిన‌ట్టే అనాలి. ఇక ఇదే జిల్లాలో ప‌లు మున్సిపాలిటీ లోనూ టిడిపి తరఫున పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులు కూడా లేని దుస్థితిలో సైకిల్ పార్టీ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: