భీమా పేరుతో చాలా మోసాలు వెలుగు లోకి వస్తున్నాయి.. పేద కుటుంబాలకు టార్గెట్ చేస్తూ వారి పేరు మీద వస్తున్న భీమాలను అప్పనంగా దోచుకుంటున్నారు.కాసుల కోసం కక్కుర్తిపడి నామినీలతో ఒప్పందాలు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా ప్రాణాలే తీసేస్తున్నాయి కొన్ని కిరాతక ముఠాలు. బీమా చేయించుకున్న వ్యక్తుల్ని హత్య చేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరిస్తూ పాలసీ డబ్బుల్ని దోచుకుంటున్నాయి. మొన్నా మధ్య నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తీగలాగితే ఆ ఏజెంట్ల ముఠా డొంక కదిలి వారు చేసిన దారుణాలు వెలుగు చూస్తున్నాయి.


డబ్బుల కోసం అమాయకుల ప్రాణాలను ఎరగా వేస్తున్నారు. వారికి తెలియకుండానే పాలసీలు చేయించడం.. తర్వాత వారిని హతమార్చడం.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం, నామినీల సాయంతో బీమా సొమ్మును కొట్టేయడం. దాదాపు ఏడేళ్ల పాటు గుట్టుగా సాగుతున్న ఓ పాలసీ ముఠా ఆగడాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకూ పాలసీ తీసుకున్న 10 మందిని పొట్టన పెట్టుకున్న ఈ బీమాసురుల దారుణాలు చూస్తే భీమా పేరంటే వణికిపోతున్నారు. అంతటి దారుణాలు చేస్తున్నారు. ఈ భీమా లో ఇద్దరు ఏజెంట్లు కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.


వీరి టార్గెట్ గిరిజన ప్రాంతాల్లో వారు మాత్రమే.. డబ్బు ఆశ చూపించి నమ్మించి పాలసీలు కట్టించుకుంటారు. బీమా డబ్బుల కోసం హత్యచేసి ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్న ముఠా దందాలు రెండు రాష్ట్రాల్లోనూ విస్తరించినట్టు నల్గొండ పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులు ఏడేళ్లుగా దామరచర్ల-మిర్యాలగూడ- నల్గొండ- సూర్యాపేట, హైదరాబాద్‌తో పాటు ఏపీలోని దాచేపల్లి, మాచర్ల, గుంటూరు ,ఒంగోలులో పది మందిని ఇలా హత్య చేసినట్టు సమాచారం. ఈ ముఠాలో దామరచర్ల మండలానికి చెందిన ఓ ఏజెంట్‌ తో పాటు మాచర్లకు చెందిన మరో ఏజెంట్‌ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు.. అందుకే ఏదైనా భీమాలో చేరాలంటే పది సార్లు ఆలోచించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్రతికుంటే బఠాణీలు అమ్ముకోవచ్చు అనే సామెత ఇప్పుడు సరిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: