జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలో జ‌న‌సేన +  టీడీపీ ఎంచ‌క్కా చెట్టాప‌ట్టాల్ రాజ‌కీయం చేస్తున్నాయి. గత సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ జ‌న‌సేన రెండో స్థానంలో నిలిచి 45 వేల పై చిలుకు ఓట్లు తెచ్చుకుంటే ... టీడీపీ నుంచి పోటీ చేసిన నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధ‌వ నాయుడు ఏకంగా మూడో స్థానంలో నిల‌వ‌డంతో పాటు 26 వేల ఓట్లు సాధించారు. అయితే ఇప్పుడు పుర పోరులో నరసాపురం మునిసిపాలిటీలో టీడీపీ, జనసేన బహిరంగంగా పొత్తులు పెట్టుకున్నాయి.  పలు వార్డుల్లో ఉమ్మడిగా అభ్యర్థులను నిలబెట్టాయి.

పట్టణంలో మొత్తం 31 వార్డులు ఉంటే వాటిలో మూడు వార్డుల్లో వైసీపీ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా విజ‌యం సాధించారు. పైగా మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ముదునూరు ప్ర‌సాద‌రాజు మంచి జోరు మీద ఉన్నారు. ఆయ‌న్ను ఢీ కొట్టేందుకు జ‌న‌సేన‌, టీడీపీ చేతులు క‌ల‌ప‌క త‌ప్ప‌లేదు. ఇప్పుడు మొత్తం 28 వార్డుల్లో అక్క‌డ ఎన్నిక‌లు జ‌రుగుత‌న్నాయి. వీటిలో 19 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుండగా, ఏడు వార్డుల్లో జనసేన అభ్యర్థులను పోటీలో నిలిపారు. టీడీపీ పోటీ చేసేచోట జనసేన అభ్యర్థులను నిలబెట్టలేదు.

జనసేన బలంగా ఉన్నచోట తెలుగుదేశం అభ్యర్థులను నిలబెట్టలేదు. ఇక తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అయితే జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను కూడా గెలిపించాల‌ని ప్ర‌చారం చేస్తున్నారు. జ‌న‌సేన నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్‌గా ఉన్న బొమ్మిడి నాయ‌క‌ర్ సైతం టీడీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాని ప్ర‌చారం చేస్తున్నారు. ఇక రెండు పార్టీల క‌ర‌ప‌త్రాలు క‌లిసే ముద్రించారు. ఇక విచిత్రం ఏంటంటే జ‌న‌సేన మిత్ర‌ప‌క్ష మైన బీజేపీ మాత్రం నాలుగు వార్డుల్లో పోటీలో అభ్యర్థులను నిలబెట్టి ఒంటరి పోరాటం చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: