ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే రాజధాని అమరావతికి కేంద్రమైన విజయవాడ కార్పొరేషన్ దక్కించుకునేందుకు టీడీపీ వేగంగా అడుగులు వేస్తోంది. టీడీపీకి కాస్తో కూస్తో ఆశలు ఉన్న ఏకైక కార్పొరేష‌న్ గా విజ‌య‌వాడ ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు సైతం అంచ‌నా వేస్తున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ త‌మ పార్టీ నుంచి మేయ‌ర్ అభ్య‌ర్థిగా విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత పేరును అధికారికంగా ప్ర‌క‌టించింది.

విజ‌య‌వాడ లో చంద్ర‌బాబు... లోకేష్ ఇద్ద‌రూ కూడా త‌మ పార్టీ అభ్య‌ర్థుల గెలుపు కోసం ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇక ఈ కార్పొరేష‌న్ ఒక్క‌టే టీడీపీ కి కాస్త ఎడ్జ్ ఉండ‌డంతో ఇక్క‌డ కూడా  గెలిచి టీడీపీని జీరోను చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ పై వైసీపీ అధిష్టానం ప్ర‌త్యేక‌మైన ఫోక‌స్ పెట్టింది. విజ‌య‌వాడలో క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్రాబ‌ల్యం చాలా ఎక్కువ‌. ఇప్ప‌టికే టీడీపీ క‌మ్మ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని మేయ‌ర్ గా ఎంపిక చేయ‌డంతో జ‌గ‌న్ అందుకు భిన్నంగా ముందుకు వెళుతున్న‌ట్టు తెలుస్తోంది.

వైసీపీ నుంచి మేయ‌ర్ రేసులో రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ పైబ‌ర్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ పూనూరు గౌతం రెడ్డి కుమార్తె లిఖితారెడ్డి ని మేయ‌ర్ చేయాల‌ని గౌతం రెడ్డి గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక గ‌త కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీలి పేరు కూడా బ‌లంగా వినిపిస్తోంది. జ‌గ‌న్ రెడ్డి వ‌ర్గం కంటే బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని చూస్తున్నార‌ట‌. అదే జ‌రిగితే పుణ్య‌శీలికే మేయ‌ర్ ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: