కర్ణాటక రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల
ఎపిసోడ్ లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. బీజేపీ మంత్రి అడ్డంగా ఇరుక్కోవడంతో .. విపక్షాలు ఇదే అస్త్రంగా విమర్శల దాడి పెంచాయి. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి రాసలీలల సీడీ వెనుక రూ. 5కోట్ల  ఒప్పందం జరిగిందని, దీనికి సంబంధించిన సమాచారం ఉందని చెప్పారు. తొలుత సీడీ గురించి మాట్లాడే వ్యక్తిని అరెస్టు చేయాలన్నారు. ఇంకా తన వద్ద సీడీలు ఉన్నాయని ప్రకటించడం వెనుక బ్లాక్‌మెయిల్‌
కనిపిస్తోందన్నారు కుమాస్వామి.

ఎవరి వ్యక్తిగత జీవితాన్నైనా ఈ విధంగా చూపడం తప్పని కుమారస్వామి అన్నారు. తనకున్న సమాచారం ప్రకారం మూడు నెలల కిందటే సీడీ చూపి బ్లాక్‌మెయుల్‌ చేశారని చెప్పారు. రాసలీలల సీడీ  వెనుక బడా నేతల హస్తముందని మరో బాంబు పేల్చారు. సమాజంలో విసుగుపుట్టించే పరిస్థితి నెలకొందని కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. ఒక మాజీ సీఎం ఎక్కడికెక్కడో వెళ్లివస్తారని.. సదరు సీడీ కూడా తన వద్ద ఉందని చెబుతున్నారని, అదెవరిదో చెబితే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో దేవేగౌడ, ఎస్‌ఎం కృష్ణ కాలం నుంచి ఎంతోమంది సీఎంలుగా పనిచేశారని, ప్రజా జీవితంలో వారిని అనుమానంతో చూసే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు.ఇలాంటి రాజకీయాలు మంచివి కావని కామెంట్ చేశారు కుమారస్వామి.

కర్ణాటక మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియోలో మంత్రితో కనిపించిన యువతి కనిపించకుండా  పోయింది. ఆమె ఎక్కడ ఉందన్న విషయం తెలియకపోవడం సంచలనంగా మారింది. యువతి ఎక్కడికి వెళ్లింది.. ఎవరూ తీసుకెళ్లారన్నది మిస్టరీగా మారింది. రాసలీలల వీడియోలో ఉన్న యువతి అసలు క్షేమంగానే ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి ఆచూకి కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. ఆమె మొబైల్ ఫోన్ నంబర్ కూడా లభ్యం కాలేదని పోలీసు వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: