దేశరాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లతో పాటు పలు రాష్ట్రాలలో మరోమారు కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలో తాజాగా నమోదైన కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా పదివేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ ఆ మార్క్‌ దాటాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాపత్ంగా 10వేల 216 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.


ఢిల్లీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 312 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికిముందు జనవరి 14న 340 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంట్లలో కరోనా కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 10,918కి చేరింది.  ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,779గా ఉండగా, ఇది జనవరి 23 తరువాత అత్యధిక యాక్టివ్ కేసుల సంఖ్య. జనవరి 23న యాక్టివ్ కేసుల సంఖ్య 1,880గా ఉంది. పంజాబ్ విషయానికొస్తే కొత్తగా 818 మందికి కరోనా సోకింది. ముఖ్యంగా జలంధర్ జిల్లాలో కొత్తగా 134 కరోనా కేసులు నమోదయ్యాయి.


కేసుల‌ను అరిక‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వేగంగా వ్యాక్సిన్ పంపిణీకి ఆదేశాలు జారీ చేసింది.  జనవరి 16న దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలవ్వగా.. తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులకు వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు. ఆ తర్వాత ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. రెండో దశలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 నుంచి 59 సంవత్సరాలకు మధ్య వయస్సు ఉండి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ప్రస్తుతం రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్‌ను కూడా ఇందులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామం చేస్తోంది. వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేసి రూ.250కే కరోనా వ్యాక్సిన్ డోస్ ఇవ్వాలని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: