తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయకపోవడం పట్ల చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలలో సీఎం కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనే ప్రయత్నం చేయటం లేదు. దీని కారణంగా కార్యకర్తలలో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కొంత మంది కార్యకర్తలు పార్టీ కోసం పని చేయాలని ముందుకు వచ్చినా సరే సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంతో వాళ్ళు కూడా దూరంగానే ఉంటున్నారు.

దీనివలన సంస్థాగతంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది కీలక నేతలు కూడా పార్టీ కోసం పని చేసే ప్రయత్నాలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నల్గొండ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని టిఆర్ఎస్ పార్టీ కోల్పోయే అవకాశం ఉంది. అయినా సరే సీఎం కేసీఆర్ ప్రచారం చేయటం లేదు. ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రావడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు.

దీంతో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అలాగే ఉప ఎన్నికల్లో కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి కాబట్టి ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రచారం చేయక పోతే మాత్రం టిఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సీఎం కేసీఆర్ కు కొంత మంది టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు సూచనలు కూడా చేస్తున్నారు. ప్రగతి భవన్ కు వెళ్ళిన ముగ్గురు మంత్రులు సీఎం కేసీఆర్ కచ్చితంగా ప్రచారం చేయాల్సి ఉందని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. సీఎం మాత్రం ఇప్పుడు ప్రచారం చేయడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. మరి భవిష్యత్తులో అయినాసరే ఆయన ప్రచారం చేస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: