ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ చాలా బలంగా ఉన్నారు. తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ చాలా బలంగా ఉన్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేకపోతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గెలిచిన తర్వాత కొన్ని ప్రతిపక్షాలను పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది కీలక నేతలను తమ పార్టీలోకి తీసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా దాదాపుగా విజయవంతం అయ్యాయి.

దీనితో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయాయి. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ చేసిన తప్పుని ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కూడా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఖాళీ చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. అందుకోసం తెలుగుదేశం పార్టీ నేతలను సంస్థాగతంగా టార్గెట్ చేస్తే ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉండొచ్చు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అడుగుపెట్టింది అంటే మాత్రం చాలా వరకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్ ను అన్ని విధాలుగా కూడా బిజెపి నేతలు టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రతిపక్షం అనేది బలంగా లేకపోతే బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ పెద్దగా ఇబ్బందులు పడిన పరిస్థితులు లేవు. ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే సీఎం కేసీఆర్ ఎదుర్కొంటున్నారో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ కూడా అదే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని కొన్ని పార్టీల విషయంలో జగన్ చూసి చూడనట్టుగా వెళ్లడమే మంచిది అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మీద జగన్ సీరియస్ గా  ఉండకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: