ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది అన్నది అర్ధమవుతుంది.   రోజురోజుకు మనుషుల్లో మానవత్వం కరువౌతుంది.  ఒకప్పుడు మనుషులు సాటి మనుషులకు సహాయం చేస్తూ ఉండేవారు. పరాయి వ్యక్తులకు కూడా కాస్త కష్టం వచ్చింది అంటే తమకు తోచిన సహాయం చేస్తూ ఉండేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం పరాయి వాళ్ళను కాదు ఏకంగా.. సొంత వాళ్ల విషయంలో కూడా కాస్త జాలి దయ చూపించడం లేదు. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికి ఉందా అని ఒక ప్రశ్న మదిలో మెదలక మానదు.



 అంతలా దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి..  సొంత వారి పట్ల కూడా ఉన్మాదులుగా మారిపోతున్న ఎంతోమంది దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. రక్తం పంచుకుని పుట్టినప్పటికీ కాస్తైనా కనికరం లేకుండా రక్తం కళ్ల చూసేంత వరకు కూడా ఎవరు వెనక్కి తగ్గడం లేదు. వెరసి రోజురోజుకు సొంత వారి నుంచి కూడా ప్రాణభయంతో అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని స్థితిలో ప్రస్తుతం నేటి రోజులలో జనాలు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల దారుణ హత్య వెలుగులోకి వచ్చింది రంగారెడ్డి జిల్లాలో.



 పట్టా పాస్ పుస్తకాల విషయంలో  అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం ఏకంగా అన్నను  హత్య చేసేంతవరకు దారితీసింది.  శంకర్పల్లి మున్సిపాలిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాదయ్య, పాండు,రాజు, శ్రీను నలుగురు సోదరులు.  అయితే ఇటీవలే లైంగిక వేధింపుల కేసులో రాజు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని  విడిపించేందుకు ముగ్గురు సోదరులు తమకు ఉన్న రెండు ఎకరాల లావణి పట్టా భూమి ని తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే పాసు పుస్తకాలను యాదయ్య వద్ద ఉంచారు సోదరులు. కానీ ఆ తర్వాత తమకు తాకట్టు పెట్టడం ఇష్టం లేదని పాస్ పుస్తకాలు తిరిగిచ్చేయాలి యాదయ్య పై ఒత్తిడి తీసుకురాగా అతను ఇచ్చేందుకు ససేమిరా అనడంతో కక్ష  పెంచుకుని ప్రత్యేకంగా గొడ్డలితో దారుణంగా దాడి చేసి హత్య చేశారు. తర్వాత పోలీసుల ముందు లొంగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: