ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రఖ్యాతిగాంచిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడిగా ఆపదమొక్కులవాడుగా  ప్రస్తుతం విరాజిల్లు తున్నాడు అయితే ప్రతి ఒక్కరు కూడా శ్రీవారిని దర్శించుకుంటే చాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు అంతే కాకుండా ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది అని ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు భక్తులు. ఇకపోతే కాలంతో సంబంధం లేకుండా ప్రతి సమయంలో కూడా..  తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో  గతంలో కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య భక్తుల దర్శనానికి అనుమతి నిషేధించారు. ఇటీవలే మళ్లీ దర్శనానికి అనుమతి కల్పించడంతో పాటు అటు దర్శనాల సంఖ్యను కూడా అంత కంతకు పెంచుకుంటూ పోతుంది టిటిడి బోర్డు అన్న విషయం తెలిసింది. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పలు రకాల నిబంధనలు కూడా భక్తులకు విధిస్తుంది.  ఈ క్రమంలోనే శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తూ ఇటీవలే టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే కరోనా వైరస్ కారణంగా ఎన్నో రోజుల నుంచి శ్రీవారి ఆర్జిత సేవ కు దూరమైన భక్తులందరూ కూడా ఇక ఇప్పుడు శ్రీవారి ఆర్జిత సేవ కోసం తో టికెట్లు బుక్ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు బుక్ చేసుకునే భక్తులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ టీటీడీ బోర్డు తెలిపింది.  ఆర్జిత సేవ టోకెన్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్న  భక్తులు 72 గంటల ముందు కరోనా రిపోర్ట్ పూర్తి చేసుకుని నెగిటివ్ వచ్చినట్లుగా రిపోర్ట్ కలిగి ఉండాలి అంటూ సూచించింది. నెగిటివ్  రిపోర్ట్ వస్తేనే భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతిస్తాము  అంటూ తేల్చి చెప్పారు టీటీడీ అధికారులు. ఇక ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవను  ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: