గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో భాగ్యనగరం కాస్త భారీ వరదల నగరం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. భాగ్యనగరం మొత్తం భారీ వరదలతో పూర్తిగా జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. దీంతో నగరవాసుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. భాగ్యనగర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురవడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఎటు వెళ్లలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మురుగు నీటిలో జీవితం గడిపారు నగరవాసులు.



 ఇక హైదరాబాద్ నగర వాసుల అందరి జీవితాల్లో గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు..  కాలరాత్రి లాంటివి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  నగరవాసులు అందరికీ ఎన్నో రాత్రులు కాళరాత్రిగా గడిచిపోయాయి. ఈ క్రమంలోనే ఇకవరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ఎన్నో రోజులు పట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే మునుపెన్నడూ లేనివిధంగా హైదరాబాద్ నగరాన్ని భారీ వరదలు ముంచెత్తడం అటు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే అక్రమ కట్టడాల కారణంగానే భారీ వరదలు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం భావించి అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు  కూడా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.



 ఇక ఇటీవలే నీతి ఆయోగ్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. 2020లో హైదరాబాద్ నగరం లో వరదలు భీభత్సం సృష్టించడానికి కారణం  ఆక్రమణలే అంటూ తేల్చి చెప్పింది నీతి అయోగ్. చెరువులు కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లే..  ఇక భారీ వర్షాలతో వచ్చిన నీరు ఎటూ పోలేక ఇక జనావాసాల్లో నిలిచిపోయిందని తద్వారా వరదలతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నీతి ఆయోగ్ తేల్చింది. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో లక్షల వరకు చెరువులు కుంటలు ఉండేవని.. కానీ ఇప్పుడు వాటి సంఖ్య కేవలం 185 తగ్గిపోయింది అంటూ చెప్పుకొచ్చింది నీతి అయోగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: