స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించింది. అలాగే వైసిపి కూడా తన స్థాయికి తగిన విధంగా ఎక్కువ స్థానాలను గెలుచుకుని తన ప్రభావాన్ని చాటింది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాస్త ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని దగ్గర చేసుకునే అవకాశాలు ఉండవచ్చునని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి జగన్ ను భారతీయ జనతా పార్టీ నమ్ముకుంది.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నమ్ముకునే అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సహకరించే విషయంలో బిజెపి నేతలకు ఇప్పటికే కొన్ని సూచనలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభావం ఆధారంగా ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లే విషయాన్ని బిజెపి పెద్దలు ఆలోచించే అవకాశాలు ఉండవచ్చు. ముఖ్యమంత్రి జగన్ కొన్ని కొన్ని అంశాలలో చాలా సీరియస్ గా   ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అనుకున్న విధంగా ప్రభావం చూపించ లేక పోవడంతో బిజెపి వైసిపిని పక్కన పెట్టే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ద్వారా బిజెపి నేతలు ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి ఎక్కువ స్థానాలు సాధించడానికి సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీల మీద ఆధారపడే అవకాశాలు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో  కూడా ఎంత వరకు ప్రభావం చూపించింది అనే అంశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం బిజెపి నేతలు చేస్తున్నట్లుగా సమాచారం. బిజెపి అగ్రనాయకత్వం ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో మాట్లాడే ఆలోచనలో ఉందని ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయనను న్యూఢిల్లీ పిలిపించుకుని తెలుగుదేశం పార్టీ ఎంతవరకు ప్రభావం చూపించింది అనే దానిపై ఒక నివేదిక తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: