ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ హవా రోజురోజుకూ తగ్గిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికలు మొదలుకొని తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు కూడా చెప్పుకోదగ్గ ఫలితాలను రాబట్టలేకపోయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీ విని ఎరుగని రీతిలో ఘోర ఓటమి చవి చూసింది. దీంతో చంద్ర బాబు పై ఎన్నో విమర్శలు అన్నీ వైపులా వినిపించాయి. అప్పటి నుండి కూడా రాష్ట్రంలో టీడీపీ పూర్వ వైభవం తెచ్చుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి నిరాశే ఎదురవుతుంది.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి టీడీపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేక చతికిల పడింది. దీంతో టీడీపీ నానాటికీ బలహీన పడుతూ ఉనికిని కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ  మున్సిపల్ ఎన్నికలపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని చూస్తుంది. అందుకోసం టీడీపీ పార్టీ కొత్త కొత్త వ్యూహాలను రచిస్తోంది. ముఖ్యంగా తమ పార్టీకి అనుకూలంగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

అందులో భాగంగానే సామాజిక వర్గాల సమీకరణాల ప్రకారం రెడ్డి సామాజిక వర్గానికి కాస్త వ్యతిరేకంగా ఉన్న ప్రాంతలైన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు వంటి ప్రాంతాలలో పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది.. అందుకోసం స్థానికంగా బలమైన నాయకులకు భాద్యతలు అప్పగిస్తూ గెలుపే లక్ష్యంగా ముందడుగు వేస్తుంది. అంతే కాకుండా కీలక నేతలతో ప్రచారాన్ని కొనసాగిస్తుంది.. అందులో భాగంగానే టీడీపీ అద్యక్షుడు చంద్ర బాబు నాయుడు రోడ్ షో లతో ఇప్పటికే ఇన్నికల ప్రచారం లో వేగం పెంచారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ వ్యూహాలు ఎంతవరకు పాలిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: