కడపలో ఒక వార్త సంచలనంగా మారింది.మైదుకూరు మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి ధనపాల జగన్ ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేశారు. అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. ప్రచారం విషయం గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇంటికి వచ్చారు.మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌తోపాటు 50 మందికిపైగా పోలీసులు ధనపాల ఇంటిని చుట్టుము ట్టారు. తననెందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని.. ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు.


అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అనే విషయం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ మైదుకూరు ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అక్కడకు చేరుకుని కనీస సమాచా రం లేకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో జగన్‌ను బలవంతం గా తీసుకెళ్లారు.. అనంతరం జగన్ కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఎక్కడ చూసినా కూడా అరెస్ట్ చేసిన జగన్ కనిపించలేదు.. దీంతో వారంతా పోలీస్ స్టేషన్ బయట ధర్నాకు దిగారు.


జగన్‌ను పోలీసులు వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు.మైదుకూరు 1వ వార్డుకు వైసీపీ అభ్యర్థి సునీత, టీడీపీ అభ్యర్థి వెంకటలక్షుమమ్మ, స్వతంత్ర అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్లు వేశారు. 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసింది. 4 గంటల సమయంలో టీడీపీ అభ్యర్థి వెంకటలక్షుమమ్మ, స్వతంత్ర అభ్యర్థి విజయలక్ష్మి ఆర్వో దగ్గరకు వెళ్ళారు. అది తెలుసుకున్న జగన్ కూడా ఆర్వో గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అతన్ని పోలీసులు లోనికి అనుమతించలేదు..అక్కడున్న పోలీసు అధికారులు జగన్‌ను గేటు వరకు తోసు కుం టూ తీసుకెళ్లారు. అయితే తనపట్ల జగన్‌ దురుసుగా ప్రవర్తించారని.. ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. అయితే ఘటన జరిగి మూడు రోజులు అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం వెనక అర్ధమేంటో అని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: