బంగారం ధ‌ర దారుణంగా ప‌డిపోతోంది.రోజురోజుకి తగ్గుతూ వస్తుండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం, యూఎస్ డాలర్ పెరగడంతో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయుని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.రానున్న రోజుల్లో ధరలు మరింతగా తగ్గే అవకాశముందని వ్యాపార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. శుక్ర‌వారం ఎంసీక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 230 తగ్గి రూ.44,311కి చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఎంసీక్స్‌లో రూ.476 తగ్గి రూ.65,455కి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పడిపోయింది. దీంతో రేటు రూ.45,220కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.350 క్షీణతతో రూ.41,450కు దిగొచ్చింది.


లాక్‌డౌన్‌లో ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్ నష్టాల పాలవ్వడంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బంగారం ధర రూ.50 వేల మార్క్‌కి చేరుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అంతర్జాతీయ పరిస్థితులు... అన్నీ కలిసి బంగారం ధరలు తగ్గేలా చేస్తున్నాయి. అయితే... ఈ తగ్గింపు భారీగా ఏమీ లేదు. ఇప్పుడు బంగారం నగలు కొనుక్కోవాలని సామాన్య, మధ్య తరగతి ప్రజలు కోరుకుంటే... ధరలు ఎక్కువే అని అనిపించడం సహజం. ఎందుకంటే... ధరలు తగ్గినా... ఇప్పటికీ అవి ఆకాశంలోనే ఉన్నాయి.



ఇదిలా ఉండ‌గా బంగారం ధర గత ఏడాది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి ఇప్పటికే 20 శాతం పతనమైంది. గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఒత్తిడి నెలకొంది. ఇన్వెస్టర్లు డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. దీని వల్ల కూడా బంగారం ధరలపై ప్రభావం పడుతోంది. అందుకే ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలు దాదాపుగా రూ.43,800 నుంచి రూ.44,000 వేల సమీపంలో స్థిర పడొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: