ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేవలం మూడే మూడు రోజుల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లో దీనికి సంబంధించిన ఫలితాలు కూడా వెలువడనున్నాయి. మళ్లీ ఆదివారం నాటికి ఆంధ్రప్రదేశ్ పట్టణాల ప్రజలు ఎవరికి మద్దతు పలుకుతున్నారు అనే అంశం క్లారిటీ రానుంది. అయితే అనంతపురం జిల్లా విషయానికి వస్తే కొన్ని మునిసిపాలిటీల మీద ప్రజల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధర్మ వరం అని చెప్పక తప్పదు. నిజానికి ఇక్కడ గతంలో తెలుగుదేశం నుంచి వరదాపురం సూరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఆయన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన కొద్దిరోజులకే అధికార పార్టీ ఒత్తిడి తట్టుకోలేక ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నిజానికి వరదాపురం సూరి కంటే ముందే పరిటాల శ్రీరామ్ కి టికెట్ ఆశించారు. 

కానీ అప్పుడు చంద్రబాబు వరదాపురం సూరిని నమ్మి టికెట్ అప్పగించారు. అయితే ఇప్పుడు వరదాపురం సూరి తప్పుకోవడంతో ఈ బాధ్యతలను సైతం పరిటాల శ్రీరామ్ కు అప్పగించారు చంద్రబాబు. దీంతో ఇక్కడ మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క వైసీపీ నుంచి సోషల్ మీడియాలో స్టార్ ఎమ్మెల్యే గా చలామణి అవుతున్న వెంకటరామిరెడ్డి ఉన్నారు. ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఈ ఎన్నికలు అటు పరిటాల శ్రీరామ్ తో పాటు ఇటు ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి  కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి.

 ఇక్కడ ఎవరు గెలిచినా ప్రత్యర్థి వర్గం పరువు కోల్పోవడం ఖాయం. ఎందుకంటే పరిటాల శ్రీరామ్ ను తెలుగుదేశం శ్రేణులు ఒక హీరో గా భావిస్తూ ఉంటారు. అయితే మొన్న ఎన్నికల్లో అధికార పార్టీ ఈవీఎంలను మేనేజ్ చేసింది కాబట్టే ఆయన ఒడి పోయారు అనే ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ధర్మవరంలో కనుక అధికార వైసీపీ మున్సిపాలిటీ చేజిక్కించుకుంటే పరిటాల శ్రీరామ్ పరువు దక్కదనే వాదన వినిపిస్తోంది. అలాగే ఒకవేళ పరిటాల శ్రీరామ్ కష్టపడి మున్సిపాలిటీ గెలుచుకుంటే ధర్మవరం ఎమ్మెల్యే ప్రభ మసక బారుతుంది అనే వాదన వినిపిస్తోంది. చూడాలి మరి ఎవరి పరువు నిలబడుతుందో ? ఎవరి ప్రభ మసకబారుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: