మరో మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నేతలు అందరూ ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. ఒకపక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా ఆయన కుమారుడు లోకేష్ అలాగే రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు అందరూ తమ తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికార పార్టీకి సంబంధించి కూడా జగన్ మినహా మిగతా అందరూ నేతలు ప్రచారంలో పాల్గొని తమ పార్టీ గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లా విషయానికి వస్తే తాడిపత్రి మున్సిపాలిటీ గురించి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు తాడిపత్రి మున్సిపాలిటీ గతంలో ఆదర్శ మున్సిపాలిటీ గా నిలిచింది. 

దేశ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈసారి ప్రజలు ఎవరికి మద్దతు పలుకుతారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇక్కడ గతంలో జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.  కేతిరెడ్డి పెద్దారెడ్డి 7500 ఓట్ల మెజారిటీతో గెలిచి వైసీపీ ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఒక వార్డు కౌన్సిలర్ గా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తూ ఉండడం ఎక్కడ ఆసక్తికరంగా మారింది. మరోపక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు కూడా ఒక వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. 

ఇక్కడ చైర్మన్ స్థానం జనరల్కు కేటాయించడంతో రెండు పార్టీల నుంచి వీరిద్దరూ చైర్మన్ అభ్యర్థులు అనేది తేటతెల్లమవుతుంది. దీంతో మున్సిపాలిటీని సాధించి చైర్మన్గా కూర్చునేందుకు ఇరువర్గాలకు చెందిన వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎవరు గెలిచినా అవతలి వారి పరువు పోవడం మాత్రం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు ఆయన మున్సిపాలిటీ దక్కించుకో కాకపోతే ఆయన పనైపోయింది అంటారు. అలానే టీడీపీ కనుక గెలిస్తే ఒక ఎమ్మెల్యే కుమారుడిని కూడా చైర్మన్ ని చేసుకోలేకపోయారు అనే వాదన కూడా బయటకు వస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: