తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి చాలా రోజులు అయిపోయింది. చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేయడం లేదు. విశాఖ జిల్లాలో ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి ప్రధాన సమస్యగా మారింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సీరియస్ గా  ఉన్నారు. ఈ తరుణంలో పార్టీలో ఉన్న కొన్ని సమస్యలు చంద్రబాబు నాయుడు దగ్గరగా గమనించినట్లు టాక్.  కొంతమంది నేతల మధ్య సమన్వయం లేదు అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించారని సమాచారం.

ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణకు కొంతమంది నేతలకు మధ్య సఖ్యత లేదు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలతో కలుపుకుని వెళ్లే ప్రయత్నం అయినా చేయడం లేదు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించినట్టుగా సమాచారం. ఆయనతో చంద్రబాబు నాయుడు నేరుగా మాట్లాడారని గంటా శ్రీనివాసరావు కూడా వెలగపూడి రామకృష్ణ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని మరో ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అనే వ్యాఖ్యలు చంద్రబాబునాయుడు దృష్టికి వచ్చాయి.

దీనితో వెలగపూడి రామకృష్ణ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా...? లేకపోతే అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా ఆయన సహకరించడం లేదా...? అనేది అర్థం కావడం లేదు. ఇక వెలగపూడి రామకృష్ణకు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. అయినా సరే ఆయన మాత్రం ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేయడంలేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నా సరే ఆయన మాత్రం ప్రజల్లోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అర్థం కావడం లేదు. ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగితే తెలుగుదేశం మరింతగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: