మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నేతలంతా బిజీగా ఉన్నారు.. ఈ మేరకు హిందూపురం లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఖాళీ లేకుండా ప్రచారం చేస్తున్నారు. నిన్న ప్రచారంలో భాగంగా ఓ అభిమానిని కొట్టిన ఆయన కొట్టిన సంగతి తెలిసిందే..ఈ విషయం కాస్త రాజకీయ చర్చలకు దారి తీసింది.. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దెబ్బలు తిన్న అభిమానిని.. బాలయ్యయ మళ్లీ ఆప్యాయతగా దగ్గర చేశారు. ఫొటో దిగారు. అభిమానులపై చేయి చేసుకోవడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. ఇదివరకు పలు సందర్భాల్లో ఆయన తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలను కొట్టిన సందర్భాలు ఉన్నాయి..


అయితే ఈ విషయం పై వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెవులు కొరుక్కుంటున్నారు. ఈ మేరకు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఓ ప్రజా ప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు అది కాదంటూ హితబోధ చేశారు. సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులను కొట్టడం, దౌర్జన్యం చేయడాన్ని ఎవరూ సమర్థించుకోలేరని అన్నారు. రాత్రి మందు కొట్టడం.. పగలు ప్రజలను కొట్టడం బాలకృష్ణకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రతినిధిగా ఆయన ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన పాపానికి సాక్షాత్తూ ఎమ్మెల్యేతో దెబ్బలు తినాల్సిన ఆగత్యం ఓటర్లకు ఏర్పడిందని ద్వజమెత్తారు.


ఇది ఇలా ఉండగా.. హిందూపురంలో టీడీపీ తప్ప మరే పార్టీకి మద్దతు లభించదు.పార్టీ ఆవిర్భవించిన తరువాత.. ఇప్పటిదాకా కూడా మరో నాయకుడు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక కాలేదు. టీడీపీ ఏకచ్ఛాత్రిధిపత్యాన్ని వహిస్తూ వచ్చిన అసెంబ్లీ స్థానాల్లో ఇదీ ఒకటి. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గట్టిగా దెబ్బకొట్టాలని వైఎస్సార్సీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. గోరంట్ల మాధవ్‌తో పాటు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, హిందూపురానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇక్బాల్, నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ నవీన్ నిశ్చల్ లు మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏకంగా ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. హిందూపురం లో ఈ ఘటన తర్వాత వైసీపీ కి ఓట్లు పడేలా కనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: