ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనను కలవడానికి చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారని తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లడానికి కొంత మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా కష్టపడ్డారు అని వార్తలు వచ్చాయి.  అయినా సరే ముఖ్యమంత్రి జగన్ మాత్రం వాళ్లకు అవకాశం ఇవ్వలేదు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలో ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్న సరే కొంత మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ ను కలవలేక పోతున్నారు అని చెప్పాలి.

స్థానిక నాయకులు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ వద్దకు తమా ఎమ్మెల్యే వెళ్ళాలి అని కోరుతున్నారు. కనీసం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి పార్టీలో ఉన్న అగ్రనేతలతో కూడా సమస్య చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలలో కూడా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ గతంలో ఎక్కువగా తిరిగేవారు. కనీసం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి ఒక్కసారి కూడా ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి లేదని చెప్పాలి.

దీంతో తెలుగుదేశం పార్టీకి కాస్త అవకాశాలు ఎక్కువగా దొరుకుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీ నేతలు సైలెంట్ గా ఉండటం పట్ల ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కనీసం ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాగే ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తే తెలంగాణ లో సీఎం కేసీఆర్ ఎలా ఇబ్బందులు పడుతున్నారో అలాగే జగన్ కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా సరే జగన్ వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: