2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం అని అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా విషయంలో పోరాడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీని కారణంగా వైసిపి ప్రజల్లో చులకన అవుతుందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి తన ఎంపీలతో కూడా ఆయన రాజీనామా చేయించిన పరిస్థితి మనం చూసాం.

అయితే ఇప్పుడు మాత్రం జగన్ పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం గానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడిగే విషయంలోగాని సాహసం చేయటం లేదు. దీని కారణంగా రాజకీయ ఇబ్బందులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన ఎంపీలు కనీసం తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకు వెళ్ళ లేకపోతున్నారు.

కేంద్రమంత్రులను కూడా కలిసే ప్రయత్నం చేయలేకపోతున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి అనేది తెలియదు. కానీ చాలా మంది మాత్రం ఎప్పుడూ ఇబ్బంది పడటం తో వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అయినా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తారని ముఖ్యమంత్రి జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు హామీ నెరవేరలేదు. ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో కూడా చాలామందికి స్పష్టత లేదు. ఇప్పుడు జగన్ ఇలాగే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో వైసిపి అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: