దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. దాదాపుగా దేశ రాజకీయాలు మొత్తం మన ప్రధాని నరేంద్ర మోదీ మరియు హోం శాఖ మంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే నడుస్తూ ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో ముఖ్యమైన పార్టీ బీజేపీ.  అన్ని రాష్ట్రాల్లో  బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఇప్పటికీ వారికి ఒక కోరిక అందని ద్రాక్షలా మిగిలిపోయింది. మొత్తం దక్షిణ భారతదేశంలో అధికారంలోకి రావాలని, కానీ ఎన్ని ప్రణాళికలు రచిస్తున్నా బీజేపీ దక్షిణాదిలో పాగా వేయడానికి కుదరడం లేదు. ఒక్క కర్ణాటకలో తప్ప మిగతా మూడు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ వేసే పాచికలు పారడం లేదు.  ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బీజేపీకి తెలంగాణలో అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. దీనికి నిదర్శనమే మొన్న జరగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో బీజేపీకి వచ్చిన సీట్లు..

దీనికి తోడు తెలంగాణలో కొన్ని వర్గాల ప్రజలకు అధికార ప్రభుత్వం తెరాసపై అసంతృప్తి భావనలు ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం.  ఇవన్నీ ఇలా ఉండగా కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సారి బీజేపీ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని సకల ప్రయత్నాలు చేస్తోంది. కేరళ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు వస్తే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది...లేదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతే కానీ బీజేపీ అధికారంలోకి ఇప్పటి వరకు రాలేదు. దీనితో మోదీ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్ ని ఎంపిక చేశారు.  

ఆ తరువాత బీజేపీ నాయకులే దీనిని ఖండించడం జరిగింది. కేరళ అసెంబ్లీలో ఎన్నికలో క్రిస్టియన్ సంస్థ CASA ఎన్డీయేకి వారి మద్దతు అని ప్రకటించడం జరిగింది. ఇది ఎన్నికలలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ అధికారంలోకి వస్తే ఎల్ డి ఎఫ్ కూటమి లేదంటే ఎల్ టి ఎఫ్, యు డి ఎఫ్ కూటమి అధికారంలోకి వస్తున్నాయి. కానీ ప్రస్తుతం బీజేపీ ఈ ఎన్నికలలో గెలవడానికి మాజీ ప్రభుత్వ ఉద్యోగులను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అయితే బీజేపీ ఇక్కడ గెలవడం విషయం పక్కన ఉంచితే, కనీసం తన ఉనికిని కాపాడుకోవడానికి కష్టమయ్యే పరిస్థితి ఉంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: