దేశ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో ఎవ్వరూ ఊహించలేరు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ అసలు ఎవరికీ లెక్కలో కూడా లేడని చెప్పాలి. అలాంటిది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో అధికారంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ని రెచ్చగొట్టి, కేసీఆర్ గురించి లేని పోని విషయాలను సోనియా గాంధీకి చెప్పడంతో, ఎలాగూ అప్పట్లో వైఎస్సార్ కూడా లేకపోవడంతో, ఇదే అదనుగా భావించిన కేసీఆర్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రత్యేక తెలంగాణను సాధించడంలో సఫలీకృతుడయ్యాడు. దీనికి 100 కి 100 శాతం కాంగ్రెస్ పార్టీ కి కేసీఆర్ ధన్యవాదములు చెప్పుకోవాలి.

ఇదే విధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేసీఆర్ కి చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉనికిలో ఉన్న టీడీపీ ని తొక్కేసి, కమ్యూనిస్ట్ పార్టీని మనుగడలో లేకుండా చేసి, కాంగ్రెస్ ఇక ఎప్పటికీ ఎదగకుండా చేసి భారతీయ జనతా పార్టీ వృద్ధిలోకి రావడానికి పరోక్షంగా సహకరించినందుకు అని చెప్పాలి. అంతే కాకుండా ఇప్పుడు అయోధ్య రామాలయాన్ని నిర్మిస్తున్న విషయం దేశమంతటికీ తెలిసిందే. దీనికి సంబంధించిన నిధుల సమీకరణ వియషంలో ప్రజా ప్రతినిధులు ఎవరికి వారు నోటికొచ్చినట్లు మాట్లాడారు. కానీ వీరందరి మాటలను తలక్రిందులు చేస్తూ అత్యధికంగా 2200 కోట్ల రూపాయలను సమీకరించడం జరిగింది. అయితే దీని నిర్మాణానికి ప్రతి రాష్ట్రము నిధులను ఇవ్వడం జరిగింది.

నిధులను విరాళంగా ఇచ్చిన అన్ని రాష్ట్రాలలో ఎక్కువ నిధులిచ్చిన రెండవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ మొత్తం 125  కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. కేవలం 45 రోజులలో ఈ నిధులను సమీకరించడం హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఇదంతా ప్రజలలో కేసీఆర్ కి ఉన్న ప్రేమ అభిమానం మరియు ప్రజలతో వీరు మాట్లాడిన మాటలే. అంతే కాకుండా ఎంఐఎం తో తెరాస చేసిన స్నేహం కారణంగా కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత మొత్తంలో నిధులను సేకరించడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. కాబట్టి బీజేపీ కేసీఆర్ కి ఈ విషయంలో ధన్యవాదములు చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: