ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో చిత్రాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో చోటు చేసుకుంటున్న రాజ‌కీయ చిత్రం మాత్రం చాలా డిఫ‌రెంట్‌గా ఉంది. ఇక్క‌డి 33 వార్డుల్లో కేవ‌లం 3 మాత్ర‌మే ఏక‌గ్రీవం అయ్యాయి. మిగిలిన 30 వార్డుల్లోనూ టీడీపీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గం ఎగ‌రేసుకుపోయింది. అంటే.. అధికార పార్టీ వైసీపీ బీఫాంల‌ను క‌ర‌ణం వ‌ర్గానికే కేటాయించింది దీంతో ఆది నుంచి కూడా వైసీపీకి చేరువైన‌.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వ‌ర్గం.. రెబెల్‌గా మారిపోయింది.

అంటే... మొత్తంగా 30 వార్డుల్లోనూ ఒక‌టి మిన‌హాయిస్తే 29 వార్డుల్లో ఆమంచి వ‌ర్గ‌మే రెబెల్స్‌గా బ‌రిలో నిలిచి పోటీ చేస్తున్నారు. ఈ ప‌రిణామం.. రాజ‌కీయంగా కాక‌రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను బ‌ట్టి.. క‌ర‌ణం వ‌ర్గంపై స్థానికంగా గుడ్ ఫీల్ రావ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ‌.. వీరిపై జంప్ జిలానీలు అనే ముద్ర ప‌డిపోతోంది. దీనికితోడు సోష‌ల్ మీడియాలోనూ క‌ర‌ణం వ‌ర్గం.. ఆయ‌న దూకుడు కార‌ణంగా ఆమంచి వ‌ర్గానికి అన్యాయం జ‌రుగుతోంద‌నే భావ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇదే ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రోవైపు క‌ర‌ణం త‌న తండ్రి అంటూ గ‌తంలో కోర్టుల్లో కేసు వేసిన క‌ర‌ణం అంబికా కృష్ణ అక్క‌డ చీరాల రౌడీయిజాన్ని త‌రిమి కొట్టాలంటూ ఆమె క‌ర‌ణంను ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ ప్ర‌చారం చేస్తోంది. ఇక‌, ఇప్పుడు ఆమంచి వ‌ర్గంగా ఉన్న‌రెబెల్స్ దూకుడు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.. స్థానికంగా ఆమంచికి తిరుగులేని గ్రిప్ ఉంది. అందుకే 2014 ఎన్నిక‌ల్లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక కూడా ఆయ‌న వైసీపీ, టీడీపీ అభ్య‌ర్థులను ఓడించి మ‌రీ ఇండిపెండెంట్‌గా గెలిచాడు.

ఇక ఇప్పుడు చీరాల వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమంచి... త‌న రెబల్స్ ఫ్యానెల్‌ను గెలిపించుకోగ‌లిగితే  ఆమంచికి వ్య‌క్తిగ‌తంగా రాజ‌కీయం.. మ‌రో మ‌లుపు తిర‌గ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అప్ప‌ట్లో ఆయ‌న విజ‌యం సాధించారు. ఇప్పుడు మ‌ళ్లీ ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌ల వేళ 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల సెంటిమెంట్ రిపీట్ అయ్యి ఆమంచి ఫ్యానెల్ నిల‌బెట్టిన రెబ‌ల్స్ గెలిస్తే చీరాల‌లో ఆమంచి తిరుగులేని హీరో అవ్వ‌డంతో పాటు క‌ర‌ణం దుకాణం స‌ర్దుకోవాల్సిందే ? 

మరింత సమాచారం తెలుసుకోండి: