తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలకు మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. అందులో ప్రధానంగా బుద్ధ వెంకన్న కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మంచి సంబంధాలు విజయవాడ టిడిపిని ఇబ్బంది పెడుతున్నాయి అన్న భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ టిడిపిలో కేసినేని నాని పవర్ హౌస్ గా ఉన్నారు. దీంతో ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి కొందరు సహకరిస్తున్నారు.

ఇక ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం జరుగుతుంది. దీనిపై రాజకీయ వర్గాలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి. చంద్రబాబు పర్యటన ఇప్పుడు విజయవాడ టీడీపీలో వర్గ విభేదాలు మరింత ఆజ్యం పోసింది అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే నారా లోకేష్ కి ఇవన్నీ తెలిసినా సరే పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదని బుద్ధ వెంకన్న ఆయన మాట వినే అవకాశం ఉన్నా సరే ఇప్పుడు నారా లోకేష్ జోక్యం చేసుకోవడం లేదు అనే ఆవేదన వ్యక్తమవుతోంది.

విజయవాడ టిడిపి నేతలు నారా లోకేష్ తో ఎక్కువగా మాట్లాడుతుంటారు. నారా లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో కూడా కొంతమంది నేతలు ఆయనకు ఎక్కువగా సహకరించారు. కృష్ణా జిల్లాలో ఉన్న అగ్రనేతలందరితో కూడా సన్నిహితంగా ఉన్నారు. కానీ ఇప్పుడు విజయవాడలో వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్న తరుణంలో ఇలాంటివి పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నా నారా లోకేష్ స్పందించడం లేదు.  ఇప్పటికైనా సరే జోక్యం చేసుకుని పార్టీని దారిలో పెడతారా లేదా అనేది చూడాలి. జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్న లోకేష్ ఇలా సైలెంట్ గా ఉండటం పట్ల కార్యకర్తలలో కూడా ఆగ్రహం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: