కొందరిపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థలు  పదేపదే కొంతమంది ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. రాజకీయంగా ఉన్న లక్ష్యాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ దర్యాప్తు సంస్థల ద్వారా కొంత మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తమవుతోంది. తాజాగా సినీ నటుల మీద కూడా ఐటి దాడులు మొదలయ్యాయి. రైతు ఉద్యమానికి మద్దతు పలికిన వారి విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది.

అందుకే ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలను కొంతమంది మీద ప్రయోగించి ప్రయత్నం చేస్తుంది. తాజాగా బాలీవుడ్ కి చెందిన కొంతమంది ప్రముఖుల మీద దాడులు చేసింది. ఉద్యమానికి మద్దతు పలికారు. అందుకే వాళ్ల మీద దాడులు చేసింది అని ఆరోపణలు వినపడుతున్నాయి. మరి కొంతమంది ప్రముఖుల విషయంలో కూడా ఇలాగే ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. వాస్తవానికి జాతీయ దర్యాప్తు సంస్థలు కొన్ని కొన్ని అంశాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రాజకీయాలకతీతంగా పనిచేయాల్సి ఉంటుంది.

కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనబడటం లేదు అనే భావన వ్యక్తమవుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు ఇబ్బందిపడ్డారు. జాతీయ దర్యాప్తు సంస్థలను భారతీయ జనతా పార్టీ వాడుకుంటుంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ల మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. అక్రమ సంపాదన పేరుతో కొంతమంది పదేపదే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దీని వలన క్షేత్ర స్థాయిలో బీజేపీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. మరి ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇలాంటి విషయాల్లో తన ఆలోచన మార్చుకుంటారా ఇలాగే ముందుకు వెళ్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: