ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. విజయవాడ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. అయితే ఇప్పుడు వీటి విషయంలో అధికార పార్టీ నేతలు కూడా జోక్యం చేసుకుంటుందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కేసినేని నాని విజయవాడలో బలంగా ఉన్న నేపథ్యంలో ఆయనను దెబ్బకొట్టడానికి తెలుగుదేశం పార్టీ నేతలకు వైసీపీ నేతలు సహకరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలతోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయవాడలో ఇబ్బంది పడుతుందని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నేతలకు ఆయన ప్రోత్సాహమే ఇప్పుడు కేసినేని నాని విమర్శలకు కారణమవుతోంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలకు తిరుగు ఉండదు. ఇప్పుడు ఆయన విజయవాడలో కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టారు. కృష్ణా జిల్లా టిడిపి మొత్తం కూడా ఇప్పుడు కేసినేని నాని కారణంగా ఇబ్బంది పడుతుందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఆయన వర్గం కారణంగా కొంతమంది నేతలు ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు వర్గ విభేదాలు మరింత తీవ్రంగా ఉండటంతో చంద్రబాబు నాయుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో కి వెళ్ళిపోయారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడలో అభ్యర్ధి విషయంలో టిడిపి  చేసిన తప్పు ఇప్పుడు వివాదాలకు మరింత ఆజ్యం పోసింది అనే భావన వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు కేసినేని నాని తో మాట్లాడే ప్రయత్నం కూడా గత కొన్ని రోజులుగా చేయడం లేదు అనే భావన కూడా ఉంది. అయితే పార్టీ పెద్దలు ఇవన్నీ జరుగుతున్న సరే సైలెంట్ గా ఉండడం పట్ల పార్టీ కార్యకర్తలు కూడా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకు తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీని వీడి బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: