ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో చోటుచేసుకుంది. అసలు ఈ మరణాలు ఆత్మహత్య కారణంగా సంభవించాయా లేక ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా అనే విషయాన్ని పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దుర్గ్ జిల్లా పోలీసుల వివరాల ప్రకారం జిల్లాలో బతేనా అనే గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారి మృతదేహాలను అనుమానాస్పద స్థితిలో నిన్న సాయంత్రం గుర్తించారు.

 ఆ ఇంటి యజమాని ఆయన కుమారుడు ఓకే తాడుకు ఉరేసుకుని కనిపించగా, అతడి భార్య ఇద్దరు కుమార్తెలు మృతదేహాలు మాత్రం ఇంటి బయట ఉన్న ఎండు గడ్డి మీద పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనుగొనబడ్డాయి. వీరి మృతదేహాలను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఎలా జరిగింది అనే అంశాన్ని పోలీసులు ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నారు. దీంతో డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను రప్పించి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సైబర్ పోలీసులు సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 

సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే ఆత్మహత్య గానే కనిపిస్తున్నా సరే దాని మీద పూర్తి అవగాహన లేకపోవడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కనుక ఇవి ఆత్మహత్యల లేక హత్యలా అనే అంశం మీద ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఈ కుటుంబానికి గ్రామంలో ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయా ? అనే అంశం మీద కూడా పోలీసులు దృష్టి పెట్టి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: