ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో చాలామంది మందుబాబులు ఏపీలో మద్యం తాగడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. త్వరలోనే కేబినెట్ సమావేశంలో మద్యం ధరల కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన విధానాన్ని తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది.

వచ్చెది వేసవి కాలం కావడంతో మద్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ మద్యం ధరల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తీరుపై మందుబాబులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు మద్యం అనేది పెద్ద సమస్యగా మారింది. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యం ధరల విషయంలో వాళ్లకు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పాత బ్రాండ్ లను కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని సమాచారం.

దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని టాక్. తెలంగాణలో మద్యం ధరలు భారీగా లేకపోవడంతో ఆదాయం భారీగా పెరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం మార్గాలు భారీగా దెబ్బతిన్నాయి. మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేయాలని భావించినా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మద్యం వస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో మద్యం ధరల పెంపు అనేది కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరల విషయంలో వెనకడుగు వేస్తోంది. నూతన విధానం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టిందని ఈ నెల మూడవ వారంలో మద్యం ధరలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: