విజయవాడ లో వర్గ విభేదాలు తెలుగుదేశం పార్టీని ముందు నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కేశినేని నాని  తో విభేదాలు ఉన్నప్పుడు ఆయన వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ వాటిని పరిష్కరించకుండా అయిన తర్వాత పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో ఇప్పుడు పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి.

అయితే ఇక్కడ ప్రధానంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మొండి పట్టుదలకు పోతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి విజయవాడలో అనుకూల పరిస్థితులు ఉన్నా సరే దాన్ని అనుకూలంగా మార్చుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ ముందడుగు వేయలేక పోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది అంటే మాత్రం విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ కోసం పని చేసే పరిస్థితి ఉండదు.

అందుకే ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కాస్త సీరియస్ గా దృష్టి పెట్టారనే చెప్పాలి. అయితే ఈ విభేదాలను ముందు నుంచే పరిష్కరించుకుని ఉంటే ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చేవి కాదు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. విభేదాలు ముగ్గురుతో ఉన్నప్పుడు కేశినేని నాని  వాళ్ళతో నేరుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయకుండా పార్టీ మీద భారం వేసారు. అందుకే పార్టీలో ఇంకా విభేదాలు కనబడుతూనే ఉన్నాయి. అయితే నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చోటు చేసుకున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాయి. అయితే చంద్రబాబునాయుడు ముందే జోక్యం చేసుకుని వీళ్ళ మధ్య విభేదాలు పరిష్కరించి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు అని అంటున్నారు. అయితే చంద్రబాబునాయుడు నిర్వహించిన ర్యాలీలో మాత్రం ముగ్గురు నేతలు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: