ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న తరుణంలో భారత్ లో మాత్రం కాస్త కట్తడి అయింది అని చెప్పాలి. వైరస్ దెబ్బకు చాలా రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం కొన్ని రాష్ట్రాల మీద పగ పట్టినట్టుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర లో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రెండు రాష్ట్రాలకు కూడా ఇతర దేశాల నుంచి భారీగా వస్తూ ఉంటారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తోంది అని ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైరస్ ని చాలా వరకు కూడా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు.

దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి అనే చెప్పాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోలేదు అని ఆరోపణలు ఉన్నాయి. రెండోదశ విషయానికి వస్తే ఇప్పుడు కొత్తరకం మన దేశంలో ప్రవేశించింది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొత్తరకంతో తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ తరుణంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఈ రెండు రాష్ట్రాలకు కూడా విదేశాల నుంచి కొంతమంది తరచుగా వస్తూ వెళ్తూ ఉంటారు.

దీనివలన కేసుల తీవ్రత భారీగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కట్టడి కాలేదు అంటే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మీద చర్యలు చేపడుతుంది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడుతున్నారు. కేరళలో త్వరలో ఎన్నికలు కూడా ఉన్నాయి ఈ తరుణంలో కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో కూడా రోజు పదివేల వరకు నమోదు కావడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలు దేశానికి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: